మంచిర్యాలలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిరుపేద క్రైస్తవులకు, పాస్టర్లకు శాసనమండలి సభ్యుడు రాజేశ్వర రావు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు అన్ని వర్గాలలోని నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సేవాకార్యక్రమం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ రాజేశ్వర రావు తెలిపారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - MANCHIRIAL LATEST NEWS
లాక్డౌన్తో దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో తాత్కాలికంగా దర్శనాలు నిలిపివేశారు. పూజారులు, పాస్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునే ఉద్దేశంతో ఎమ్మెల్సీ రాజేశ్వర రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
ఏఐఎమ్ ఏసియా బిషప్ లారా సహకారంతో సరుకులు పంపిణీ చేశామని ఎమ్మెల్సీ రాజేశ్వర రావు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం