తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ నిత్యావసర సరుకుల అందజేత - 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేత

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 100 మంది పేద బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ సతీష్ కుమార్ 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్​డౌన్ పూర్తయ్యేవరకూ ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచించారు.

mla sathish distributed latest news
బ్రాహ్మణులకు ఎమ్మెల్యే నిత్యావసర సరుకుల అందజేత

By

Published : May 2, 2020, 8:30 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి రోడ్డులోని బ్రాహ్మణ సంక్షేమ భవనంలో పురోహితులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు శాసన మండలి సభ్యుడు పురాణం సతీష్ కుమార్. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు అన్ని వర్గాలలోని నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నిరుపేద బ్రాహ్మణులకు సాయం చేసినట్లు తెలిపారు.

కరోనా వైరస్​ను అరికట్టడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్​డౌన్ ప్రకటించగానే దేవాలయాలు మూసివేశారని దాని వల్ల పురోహితులకు ఉపాధి కరువైందని అన్నారు. అందువల్లే 100 మంది బ్రాహ్మణులకు 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేసినట్లు సతీశ్ కుమార్ వివరించారు.

ఇవీ చూడండి:కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం

ABOUT THE AUTHOR

...view details