మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు మొక్కలు నాటి ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. నియోజకవర్గ కేంద్రంలోని నస్పూర్, మంచిర్యాల, హజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో పర్యటించి అధికారులతో కలిసి మొక్కలు నాటి హరితహారం ప్రారంభించారు.
మంచిర్యాలలో హరితహారం ప్రారంభించిన ఎమ్మెల్యే - మంచిర్యాలలో హరితహారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంచిర్యాల నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు దివాకర్ రావు మొక్కలు నాటి ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి ఆయన మొక్కలు నాటారు.
గత హరితహారం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నాటిన మొక్కల్లో 92 శాతం మొక్కలు సంరక్షించబడ్డాయని ఆయన అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని 36 వార్డులలో ఈ ఏడాది 5లక్షల 55 వేలు, నస్పూర్ మండలంలో లక్షా 55వేల మొక్కలు నాటడానికి ప్రణాళిక వేశామని తెలిపారు. ప్రధాన రహదారికి ఇరువైపుల 13వేల మొక్కలు నాటి మిగతావి కాలనీల్లో, ఇళ్ల ముందర నాటుతామని అన్నారు. నాటిన మొక్కలు సంరక్షించేందుకు కంచెలు ఏర్పాటు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. పశువులు మొక్కలు తినకుండా కాపాడాల్సిన బాధ్యత స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలదే అన్నారు.