మంచిర్యాల జిల్లా తాండూరులో పలు అభివృద్ధి పథకాలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. రేచిని గ్రామంలో ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్‌ను ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం.. గ్రామసీమలు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటోందని ఎమ్మెల్యే అన్నారు. దేశంలోనే తెలంగాణ పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు.