తెలంగాణ

telangana

ETV Bharat / state

సీతారాంపల్లి గ్రామంలో హై లెవెల్ వంతెనకు భూమిపూజ - ఎమ్మెల్యే దివాకర్ రావు లేటెస్ట్ అప్డేట్స్

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో హై లెవెల్ వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే దివాకర్ రావు భూమిపూజ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి నస్పూర్ మున్సిపాలిటీ వరకు లైటింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రహదారులు, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

mla diwakar reddy started high level bridge at seetharampally in mancherial
సీతారారంపల్లి గ్రామంలో హై లెవెల్ వంతెనకు భూమిపూజ

By

Published : Oct 30, 2020, 2:07 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి నస్పూర్ మున్సిపాలిటీ వరకు ప్రధాన రహదారి మధ్యలో లైటింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో హై లెవెల్ వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు.

సీతారాంపల్లి నుంచి మున్సిపాలిటీకి రాకపోకలను కలిపేందుకు రూ. కోటి ఇరవై ఐదు లక్షల వ్యయంతో హై లెవెల్ వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రహదారులు, రవాణా అనుకూలంగా ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.

ఇదీ చదవండి:'మత్తు' తీసుకుంటే రోగ నిరోధక శక్తి చిత్తు

ABOUT THE AUTHOR

...view details