తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి' - mla divakar rao participated in pattana pragathi

వానాకాలంలో దోమలు వ్యాప్తి చెంది సీజనల్​ వ్యాధులు వస్తాయని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్​ రావు సూచించారు. పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి రెండో విడత కార్యక్రమంలో పాల్గొన్నారు.

mla divakar rao participated in pattana pragathi second phase in mancherial
పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావు

By

Published : Jun 4, 2020, 2:50 PM IST

పట్టణాల అభివృద్ధి కోసమే కేసీఆర్ సర్కార్ పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన పట్టణ ప్రగతి రెండో విడత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

మంచిర్యాలలోని పలు కాలనీలను సందర్శించిన దివాకర్ రావు.. సమస్యలపై ఆరా తీశారు. కాలనీల్లో మురుగు కాలువల్లో నిల్వ ఉన్న మురుగు నీటిని తరలించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశమున్నందున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details