తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారిని మృత్యుంజయున్ని చేసిన వైద్యునికి ఎమ్మెల్యే సన్మానం - MLA DIVAKAR RAO APPRECIATED DOCTOR KUMAR VARMA FOR SAVING CHILD

తల్లిదండ్రుల ఆలనాపాలనకు దూరమై డెంగ్యూ భూతాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డ చిన్నారిని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్​రావు పరామర్శించారు. బాలున్ని పూర్తి ఆరోగ్యలంతున్ని చేసిన వైద్యున్ని సన్మానించారు.

MLA DIVAKAR RAO APPRECIATED DOCTOR KUMAR VARMA FOR SAVING CHILD

By

Published : Nov 19, 2019, 3:07 PM IST

కుటుంబాన్నంతా పొట్టనబెట్టుకుని... తననూ బలితీసుకునేందుకు వచ్చిన డెంగీని జయించిన చిన్నారిని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్​రావు చూశారు. బాబుకు ఉచితంగా వైద్యం అందించిన శ్రీమహాలక్ష్మీ ఆస్పత్రి వైద్యుడు కుమార్ వర్మను ఎమ్మెల్యే సన్మానించారు. కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారిపై మానవతా దృక్పథం చూపిన ఆసుపత్రి సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో బాబుకు కావల్సిన అవసరాలను అందిస్తానని దివాకర్​రావు హామీ ఇచ్చారు.

చిన్నారిని మృత్యుంజయున్ని చేసిన వైద్యునికి ఎమ్మెల్యే సన్మానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details