పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ తహశీల్దార్ కార్యాలయంలో జైపూర్, భీమారం మండలాలకు చెందిన సుమారు 84 మంది లబ్ధిదారులకు రూ.84,09,744 విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాల్కసుమన్ - mancherial district latest news
మంచిర్యాల జిల్లా జైపూర్ తహశీల్దార్ కార్యాలయంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. సుమారు 84 మంది లబ్ధిదారులకు రూ.84,09,744 విలువ గల చెక్కులు అందజేశారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం విధిగా ఆచరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి.. 'జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించాలి'