తెలంగాణ

telangana

ETV Bharat / state

Mission Bhagiratha Pipeline leakage : పాతళగంగ కాదు.. మిషన్ భగీరథ పంపు - హాజీపూర్‌లో మిషన్ భగీరథ పైపు లీకేజీ

Mission Bhagiratha Pipeline leakage: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల ప్రధాన రహదారి.. చెరువును తలపిస్తోంది. మిషన్ భగీరథ పైపులైన్ పగిలి పాతాళగంగలా నీరు ఎగిసిపడుతోంది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆ నీటిలో తడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. రహదారిపై వరద చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Mission Bhagiratha Pipeline leakage
మిషన్ భగీరథ పైపు లీకేజ్

By

Published : Feb 28, 2022, 5:38 PM IST

పాతళగంగ కాదు.. మిషన్ భగీరథ పంపు

Mission Bhagiratha Pipeline leakage :మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల ప్రధాన రహదారి వెంట ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్‌ పగిలి పోయింది. గోదావరి జలాలు ఎగిసి పడుతున్నాయి. ప్రధాన రహదారిపై నీరు వృధాగా పారుతోంది. పైప్‌లైన్‌ పగిలి వరదగా మారడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Mission Bhagiratha Pipeline leakage at Hajipur : హాజీపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేశారు. మహా శివరాత్రికి గోదావరి పుణ్య స్నానాలకు ముల్కల్‌ వెళ్లే భక్తులు కొంత ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details