జగిత్యాల, రామగుండం, లక్షెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు - Telangana Minor earthquakes updates
19:26 October 31
జగిత్యాల, రామగుండం, లక్షెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు
జగిత్యాల, రామగుండంలో ఇవాళ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 6.49 గంటల సమయంలో పట్టణంలోని రహమత్ పురలో 4 సెకండ్లపాటు కదిలికలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. జగిత్యాలతో పాటు కొడిమ్యాల మండలం దమ్మయ్యపేటలో రాత్రి ఏడు గంటల 15 నిమిషాలకు భూమిలో శబ్దం రావడం వల్ల ఒక్కసారిగా జనం పరుగులు తీశారు. బీర్పూర్, కోరుట్ల, మెట్పల్లి, మల్యాల, వెల్గటూర్ తదితర మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోనూ భూమి స్వల్పంగా కంపించింది. గోదావరి పరివాహక గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.
ఇదీ చదవండి:DK Aruna: 'ఓటమి భయంతోనే ఈవీఎంలు, వీవీప్యాట్లు మారుద్దామనే ఆలోచన'