తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆయిల్ ఫామ్ సాగు​కు చెన్నూరు అనుకూలం: మంత్రి నిరంజన్

ఆయిల్ ఫామ్​ సాగుకు చెన్నూరు నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తనవంతుగా చెన్నూరుకి మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. జైపూర్, భీమారం మండలాల్లోని రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు.

minister-niranjan-reddy-about-oil-farm-plantations-in-state-at-chennur-in-mancherial-district
ఆయిల్ ఫామ్ సాగు​కు చెన్నూరు అనుకూలం: మంత్రి నిరంజన్

By

Published : Jan 19, 2021, 9:11 AM IST

ఆయిల్ ఫామ్ సాగు​కు చెన్నూరు అనుకూలం: మంత్రి నిరంజన్

రాష్ట్రంలో 8.15లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్​ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ లాంటి కొత్తతరం రాజకీయ నాయకులు రాష్ట్రానికి అవసరమన్నారు. సోమవారం నాడు జైపూర్, భీమారం మండలాల్లోని రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి చెన్నూరు వాతావరణం, నేలలు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తనవంతుగా చెన్నూరుకి మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ఆయిల్‌ఫామ్ నర్సరీని సందర్శించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, కలెక్టర్ భారతి హోళికేరి, జడ్పీ ఛైర్​పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:వ్యాక్సిన్ వచ్చింది... వర్క్ ఫ్రమ్​ హోం కొనసాగుతుందా?

ABOUT THE AUTHOR

...view details