నిత్యావసర సరకులు లేక ఇబ్బందులు పడుతున్న తమిళనాడు రాష్ట్ర డ్రైవర్లకు నిత్యావసర సరకులు అందింపజేసి మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం గుల్లపాడ్ గ్రామంలో సింగరేణి నిర్మిస్తున్న సోలార్ ప్లాంట్ కోసం తమిళనాడు డ్రైవర్లు లారీల్లో యంత్రాలను తీసుకువచ్చారు. లాక్‌డౌన్ వల్ల గ్రామంలోనే ఉండిపోయి... తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని... తమకు సహాయం చేయాలని సామాజిక మాధ్యమం(వాట్సాప్)లో మిత్రులకు సందేశాన్ని వారు పంపించారు.
తమిళ డ్రైవర్ల పస్తులు... స్పందించిన మంత్రి కేటీఆర్
వారు తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్లు. లాక్‌డౌన్ వల్ల తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఇరుక్కుపోయారు. తినడానికి తిండిలేక విలవిల్లాడారు. విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్పందించి... వారికి నిత్యావసర సరుకులు ఇవ్వడమే గాక... వారి ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.
ఆకలితో తమిళనాడు డ్రైవర్లు... స్పందించిన మంత్రి కేటీఆర్
అది చూసిన తమిళనాడు యువకుడు ఈ విషయాన్ని కేటీఆర్‌కు ట్విట్టర్లో తెలియపరిచారు. స్పందించిన ఆయన వారికి సహాయం అందజేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను ఆదేశించారు. బాల్క సుమన్ సూచనతో కాసిపేట ఎస్సై రాములు గ్రామానికి చేరుకొని వారికి నిత్యావసర సరకులు అందజేసి... తమిళనాడు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. స్పందించిన మంత్రికి డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి :ఫేస్బుక్ వల.. 12 లక్షలు స్వాహా