తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ధాటికి బుడతడికీ తప్పని వలసలు - కరోనా ధాటికి బుడతడికీ తప్పని వలసలు

కరోనా లాక్​డౌన్ కారణంగా బుడిబుడి అడుగులేయాల్సిన వయసులో వందల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన దుస్థితి. అలసటగా ఉన్నా తల్లిదండ్రులకు చెప్పలేని పసితనం. ఆకలికి అలమటించినా ఏడుపే దిక్కు తప్ప బయటకు చెప్పలేని పసిమనసు. ఇవన్నీ కరోనా మహమ్మారి తెచ్చిన క్లిష్ట పరిస్థితులు.

కరోనా ధాటికి బుడిబడి అడుగుల్లేవ్... ఆహారం లేదు
కరోనా ధాటికి బుడిబడి అడుగుల్లేవ్... ఆహారం లేదు

By

Published : Apr 30, 2020, 7:48 PM IST

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో రెండేళ్ల చిన్నారిని బొమ్మ సైకిల్​పై కూర్చొబెట్టి తండ్రి లాక్కొని వెళ్తోన్న దృశ్యం జాతీయ రహదారిపై కనిపించింది. కరోనా మహమ్మారి ముంచెత్తుతున్న తరుణంలో హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నామని వలస కూలీ పేర్కొన్నారు. తమ బృందంలో ఇలా మరింత మంది ఉన్నారని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details