తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇటుక బట్టీల కూలీలను స్వస్థలాలకు పంపిన పోలీసులు - మంచిర్యాల జిల్లా వార్తలు

మంచిర్యాల జిల్లా హజీపూర్​ మండలంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికులను రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు స్వస్థలాలకు పంపారు. వలస కూలీలను స్వస్థలాలకు పంపాలన్న కేంద్ర, రాష్ట్ర ఆదేశాల మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కార్మికులను సొంతూళ్లకు పంపారు.

Migrant Labor Sent To Hometowns By Ramagundam Police
ఇటుక బట్టీల కూలీలను స్వస్థలాలకు పంపిన పోలీసులు

By

Published : May 23, 2020, 11:14 PM IST

మంచిర్యాల జిల్లా హజీపూర్​ మండలంలో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒడిశాకు చెందిన వలస కార్మికులను పోలీసులు స్వస్థలాలకు పంపారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు 11 బస్సులు ఏర్పాటు చేసి ఇటుక బట్టీల్లో పని చేస్తున్న వలస కార్మికులను వారి ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు కలిసి ఒడిశా కూలీలను సొంతూళ్లకు పంపారు.

ABOUT THE AUTHOR

...view details