తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో మెగా రక్తదాన శిబిరం

మంచిర్యాల జిల్లాలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తలసేమియా బాధితులను కాపాడేందుకే రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. యువత స్వచ్ఛందంగా ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

mega-blood-donation-camp-in-mancherial-district
మంచిర్యాలలో మెగా రక్తదాన శిబిరం

By

Published : Jan 3, 2021, 1:56 PM IST

మంచిర్యాల జిల్లాలోని కొక్కిరాల రఘుపతి రావు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలోని రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిధి కేంద్రానికి 600 యూనిట్ల రక్తాన్ని అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు వేల మంది తలసేమియా సికిల్సెల్ బాధితులను కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన రక్త నిల్వలు లేకపోవడం వల్లే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ తెలిపారు. తమ పిలుపుతో మంచిర్యాల జిల్లాలోని యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు.

రక్త దానం చేయడమంటే మరొకరికి ప్రాణదానం చేయడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనే యువత కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజర్, శరీర ఉష్ణోగ్రతలు పరిశీలిస్తూ అనుమతించారు.

ఇదీ చదవండి:రుణాలతో వల.. జీవితాలు విలవిల

ABOUT THE AUTHOR

...view details