తెలంగాణ

telangana

ETV Bharat / state

మందుబాబుల హల్​చల్​.. స్థానికుల ఇబ్బందులు - రోడ్డుపైనే మందుకొడుతున్నారు

మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్​ లేనందున... మందు బాబులు రోడ్డుపైనే తాగుతున్నారు. కాలనీవాసులు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఘటన మంచిర్యాలలోని ఆర్పీ రోడ్డులో చోటుచేసుకుంది.

mandubabula halchal in mancherial rp road
మందుబాబుల హల్​చల్​.. స్థానికుల ఇబ్బందులు

By

Published : Jul 2, 2020, 7:00 PM IST

మంచిర్యాలలోని ఆర్పీ రోడ్డు పరిసరాల కాలనీవాసులు మందు బాబులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోర్​ సూపర్​ మార్కెట్​కు ఎదురుగా ఉన్న శ్రీనివాస వైన్స్​ పక్కన సీసీ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి మందు కొడుతున్నారు. దీంతో కాలనీవాసులు బయటికి వెళ్లాలంటేనే భయమైతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్​ అధికారులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మందుబాబుల హల్​చల్​.. స్థానికుల ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details