తెలంగాణ

telangana

ETV Bharat / state

మందమర్రి పోలీసుల పకడ్బందీ చర్యలు.. రోడ్డెక్కని ప్రజలు - Corona lock down Mandamarri Mancherial

లాక్‌డౌన్ నేపథ్యంలో కూరగాయలు, మాంసం మార్కెట్ల వద్ద రద్దీ పెరగకుండా మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పట్టణంలో 4 చోట్ల మార్కెట్లను ఏర్పాటు చేశారు. కొనుగోలు కోసం నడుస్తూ రావాలని ఆదేశాలివ్వడం వల్ల ప్రజలు తక్కువ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు.

మందమర్రిలో లాక్‌డౌన్‌
మందమర్రిలో లాక్‌డౌన్‌

By

Published : Apr 19, 2020, 5:50 PM IST

కూరగాయలు, మాంసం మార్కెట్ల వద్ద కొనుగోలుదారులు గుమిగూడకుండా మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీసులు వినూత్నరీతిలో చర్యలు చేపట్టారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పట్టణంలో 4 చోట్ల మార్కెట్లను ఏర్పాటు చేశారు. వీటిని కొనుగోలు చేసే ప్రజలు నడుచుకుంటూ రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానంపై ప్రజలు నుంచి మంచి స్పందన వచ్చింది. పట్టణవాసులు కాలినడకన వచ్చి భౌతిక దూరం పాటిస్తూ సరుకులను కొనుగోలు చేశారు. నిబంధనలు పాటించని ఐదుగురి వాహనాలను పోలీసులు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details