మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని యాచకులకు.. మున్సిపాలిటీ సిబ్బంది ఆహారం అందించి ఉదారతను చాటుకున్నారు. రెండోదశలో కొవిడ్ విజృంభిస్తున్న విపత్కర సమయంలో యాచకులు ఆహారం లేకుండా రైల్వే స్టేషన్లో బిక్కుబిక్కుమంటూ.. కాలం వెళ్లదీస్తున్నారు.
యాచకులకు మున్సిపల్ సిబ్బంది సాయం - యాచకులకు మున్సిపల్ సిబ్బంది సాయం
యాచకులకు మంచిర్యాల మున్సిపల్ సిబ్బంది సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. భిక్షాటన చేస్తూ బతికే వారికి పండ్లు, ఆహారాన్ని అందించారు.

FOOD DISTRIBUTION
వారిని గుర్తించిన మున్సిపాలిటీ కమిషనర్ స్వరూపారాణి తమ కార్యాలయ సిబ్బంది సహకారంతో 53వేల రూపాయలు జమ చేసి.. భిక్షాటన చేస్తూ బతికే వారికి పండ్లు, ఆహారాన్ని అందించారు. లాక్డౌన్ వేళ ఆహారం లేక ఇబ్బందులకు గురవుతున్న వారికి స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారాలను అందించాలని కోరారు.
ఇదీ చదవండి:సెంట్రల్ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట