తెలంగాణ

telangana

ETV Bharat / state

'బార్‌లో లేని కరోనా.. బడిలోనే ఉందా?' - Manchiryala District latest News

ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వమే ఆదుకోవాలని మంచిర్యాల జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్‌రావు పేర్కొన్నారు. బడులు మూసివేతపై... ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు.

Private Schools Association
ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన

By

Published : Apr 4, 2021, 12:12 PM IST

కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాత్రమే బడులు ప్రారంభించి... తర్వాత మూసివేశారని మంచిర్యాల జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్‌రావు ఆరోపించారు. సాగర్ ఎన్నికల ప్రచారంలో గుంపులు గుంపులుగా తిరిగితే రాని కరోనా పాఠశాలలో ఎలా వస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు.

పాఠాలు లేకుండా ప్రమోట్ చేయటం వల్ల విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని విష్ణువర్ధన్‌ సూచించారు. గత సంవత్సర కాలం నుంచి తాము ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ భవిష్యత్ గురించి ఆలోచన చేయాలన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని... వెంటనే పాఠశాలలు తెరిచి తమని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ఆ పిల్లలకు ఆయనే అమ్మానాన్నా!

ABOUT THE AUTHOR

...view details