తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐపీఓను రద్దు చేయకుంటే పోరాటం తప్పదు: ఎల్ఐసీ ఏజెంట్లు - telangana news

జీవిత బీమా సంస్థ పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ఏజెంట్లు ధర్నా చేపట్టారు. విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం ఏజెంట్లకు గ్రాట్యుటీని పెంచాలని కోరారు.

LIC Agents Dharna in Manchiryala
పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలి: ఎల్ఐసీ ఏజెంట్లు

By

Published : Mar 23, 2021, 3:32 PM IST

పాలసీదారులకు చెల్లించే మెచ్యూరిటీలో బోనస్​లు పెంచాలని మంచిర్యాల జిల్లా ఎల్ఐసీ ఏజెంట్లు ధర్నా చేపట్టారు. ఐపీఓను రద్దు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ధర్నా చేయాలన్న జీవిత బీమా సమైక్య పిలుపు మేరకు విధులు బహిష్కరించామని జిల్లా అధ్యక్షుడు తిరుపతి యాదవ్ తెలిపారు.

1956లో రూపొందించిన బీమా చట్టాలలో సవరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా మార్చాలని కోరారు. ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం ఏజెంట్లకు గ్రాట్యుటీ పెంచాలన్నారు.

ఇదీ చదవండి:ఎడ్లబండిపై దర్జాగా శునకం సవారీ..

ABOUT THE AUTHOR

...view details