మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బెజ్జాల గ్రామంలో 'పోలీసులు మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హాజరయ్యారు. ఆదివాసీలకు బియ్యం, వృద్ధులకు దుప్పట్లు, చిన్న పిల్లలకు చెప్పులు, క్రీడా పరికరాలు పంపిణీ చేశారు.
ఆదివాసీ గ్రామంలో 'పోలీసులు మీ కోసం' కార్యక్రమం - మంచిర్యాల జిల్లా వార్తలు
ఆదివాసీ గ్రామం బెజ్జాలలో 'పోలీసులు మీ కోసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివాసీలకు బియ్యం, వృద్ధులకు దుప్పట్లు, చిన్న పిల్లలకు చెప్పులు, క్రీడా పరికరాలు అందజేశారు. కష్టాలు వచ్చినపుడు పోలీసులు ఉన్నారన్న విషయాన్ని మరచిపోవద్దని రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు.
![ఆదివాసీ గ్రామంలో 'పోలీసులు మీ కోసం' కార్యక్రమం manchirial police visited tribal village bejjala in manchirial district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9512610-485-9512610-1605094916445.jpg)
ఆదివాసీ గ్రామంలో 'పోలీసులు మీ కోసం' కార్యక్రమం
ఒకప్పుడు బెజ్జాల గ్రామంలోకి యూనిఫాంతో రావాలంటేనే భయపడేవారని సీపీ సత్యనారాయణ అన్నారు. ఆదివాసీ విద్యార్థులకు కానిస్టేబుల్ ఎంపిక పరీక్షకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారన్న విషయాన్ని మరిచిపోవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి, ఏసీపీ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.