ఆయన కరోనా బారిన పడ్డారు... చికిత్స పొందే సమయంలో మానసికక్షోభ అనుభవించారు.. తనలాంటి బాధ ఎవరూ పడకూడదని నిర్ణయించుకున్నారు.. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిత్యావసర సరకుల్లో వైరస్‌ను నిర్మూలించే పరికరాన్ని రూపొందించారు. ఆయనే మందమర్రి పట్టణంలోని అంగడిబజార్‌కు చెందిన గడ్డం ప్రవీణ్‌కుమార్. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో అభియంతగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా కరోనా రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి మందమర్రిలోని స్వగృహానికి వచ్చారు. కొన్ని రోజులు బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రం, మరికొన్ని రోజులు హోంక్వారంటైన్‌లో చికిత్స పొందారు. ఈ క్రమంలో కరోనా నివారణకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ పరికరం కరోనాను కడిగేస్తోంది..! - covid-19 latest news
కరోనా బారిన పడి ఓ వ్యక్తి మానసిక క్షోభ అనుభవించాడు. తనలా ఎవరూ బాధపడకూడదని నిర్ణయించుకున్నాడు. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే వైరస్ పోతుంది కానీ సరకులపై ఎలా పోతుందని ఆలోచించాడు. అలా ఆలోచించడమే కాదు... సొంత ఖర్చుతో యూవీ శానిటైజర్ పరికరాన్ని తయారుచేశాడు. ఆయనే మందమర్రికి చెందిన గడ్డం ప్రవీణ్‌కుమార్.
కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో నిత్యావసర సరకులు సైతం కొనేందుకు చాలా మంది జంకుతున్నారు. చేతులనైతే శానిటైజర్ ద్రావణంతో శుభ్రం చేసుకుంటే వైరస్ పోతుంది.. సరకులకు ఉన్న వైరస్ ఎలా నివారించవచ్చు అనే ఆలోచనే ప్రవీణ్ మనసుకు తట్టింది. ఆయన ఇంజినీర్ కావడం.. తనకు తెలిసిన అంశాలకు తోడు మరింత సమాచారం కోసం అంతర్జాలంలో శోధించారు. యూవీ కిరణాలు వెదజల్లే దీపాలను తయారు చేసి ఓ పెట్టెలో అమర్చారు. నిత్యావసర సరకులను అందులో ఉంచి 30 సెకన్ల పాటు లైట్లు వేస్తారు. దీంతో వస్తువులపై ఉన్న వైరస్, బ్యాక్టీరియా నశిస్తుందని ఆయన తెలిపారు. దీన్ని తయారు చేయడానికి రూ.3 వేల వరకు ఖర్చు అయిందని పేర్కొన్నారు. కొన్ని కార్పొరేట్ విక్రయశాలల్లో వాడే యంత్రాలు భారీ ఖర్చుతో కూడుకుని ఉంటాయని.. తాను రూపొందించిన యంత్రం చిన్న వ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: ఉపాధ్యాయులూ యోధులే.. పాలకుల దృక్పథం మారాలి!