మంచిర్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం సబ్ రిజిస్ట్రార్ అధికారి అప్పారావును మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పారావు గత మార్చి ఒకటిన ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులో 847 గజాల భూమిని లేఅవుట్ నిబంధనలు ఉల్లంఘించి మూడు ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.
Suspension: మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్
లేఅవుట్ నిబంధనలు ఉల్లంఘించి ప్లాట్లు చేసిన వ్యవహారంలో మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకున్నారు.
మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్
దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు అధికారులు నిబంధనలు బేఖాతరు చేసినట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ సీనియర్ అసిస్టెంట్ మురళిని ఇన్ఛార్జ్ సబ్‌రిజిస్ట్రార్‌గా నియమించారు.
ఇదీ చూడండి:నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!
TAGGED:
mancherial latest news