తెలంగాణ

telangana

ETV Bharat / state

టేకు లక్ష్మీకి న్యాయం చేయాల్సిందే... - టేకు లక్ష్మీకి న్యాయం చేయాల్సిందే...

టేకు లక్ష్మీపై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ... మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అన్ని వర్గాల ప్రజలు రహదారులను మూసివేశారు.

rally
టేకు లక్ష్మీకి న్యాయం చేయాల్సిందే...

By

Published : Dec 7, 2019, 7:56 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అన్యాయంగా హత్యాచారానికి గురైన టేకు లక్ష్మీకి న్యాయం చేయాలంటూ అన్ని వర్గాల ప్రజలు రహదారులను మూసివేశారు. వాహనాల రాకపోకలు ఎక్కడిక్కడకే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

దిశ ఘటన నిందితులను ఎన్​కౌంటర్ చేసినట్లు టేకు లక్ష్మిని చంపిన నిందితులను కూడా ఎన్​కౌంటర్ చేయాలని బుడిగ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత డిమాండ్ చేశారు. దిశ ఘటన కంటే ముందు టేకు లక్ష్మీపై హత్యాచారం జరిగినప్పటికీ... నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ ఘటనలో స్పందించిన తరహాలో ప్రభుత్వం లక్ష్మీ విషయంలోనూ స్పందించాలని కోరారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

టేకు లక్ష్మీకి న్యాయం చేయాల్సిందే...

ఇవీ చూడండి: ఈనెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details