మంచిర్యాల జిల్లాలో ఒకే డిపో ఉన్నప్పటికీ అద్దె బస్సులతో పాటు అదనంగా మరిన్ని బస్సులను నడిపి ప్రజలకు రవాణా సేవలను అందిస్తున్నారు. దీంతోపాటు నెలకు పైగా బస్సులు డిపోకే పరిమితం కావడంతో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
తిరగని చక్రం.. తీరని నష్టం - lock down effect on mancherial rtc
మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’ అన్న చందంగా తయారైంది. అప్పటికే ఆర్టీసీ సిబ్బంది సమ్మెతో నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రగతి చక్రంపై లాక్‌డౌన్ అశనిపాతంలా మారింది. కరోనా వైరస్ ప్రభావంతో 44 రోజులుగా బస్సులు రోడ్డు ఎక్కలేదు. జిల్లాలో ఉన్న ఏకైక ఆర్టీసీ డిపోకు తీరని నష్టం వాటిల్లుతోంది.
![తిరగని చక్రం.. తీరని నష్టం lock down effect on mancherial rtc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7063081-452-7063081-1588644573507.jpg)
నష్టాల్లో మంచిర్యాల ఆర్టీసీ
లాక్‌డౌన్ ప్రభావం సంస్థతో పాటు సిబ్బందిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అసలే నష్టాల్లో కూరుకుపోయినందున లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ ఆ సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వానికి సవాలుగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.