తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం దుకాణానికి 20 వేలు జరిమాన విధించిన కలెక్టర్ - మంచిర్యాల జిల్లా కలెక్టర్ హోళీ కేరి వార్తలు

కలెక్టర్​ ఆకస్మిక పర్యటనలో ఓ మద్యం దుకాణం యజమానికి 20వేల రూపాయల అపరాధ రుసుము విధించిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కలెక్టర్ భారతి హోల్ళికేరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రంగా ఉన్న దుకాణానికి జరిమాన వేశారు.

mancherial collector fined 20 thousand to liquor shop in bheemaram
మద్యం దుకాణానికి 20 వేలు జరిమాన విధించిన కలెక్టర్

By

Published : Dec 16, 2020, 4:13 PM IST

మంచిర్యాల జిల్లా భీమారంలో జిల్లా కలెక్టర్ భారతి హోల్ళికేరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా నిర్వహిస్తున్న తన్వి మద్యం దుకాణానికి వెళ్లారు. ఆవరణలో అపరిశుభ్రం, ప్లాస్టిక్ వ్యర్థాలు చూసి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యం దుకాణం యజమానికి 20 వేల రూపాయల అపరాధ రుసుము విధించాలని పంచాయతీ అధికారులకు ఆదేశించారు. తగిన జాగ్రత్తలు తీసుకుని, శుభ్రం పాటించాలని దుకాణం యజామానికి సూచించారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

ఇదీ చూడండి:బావిలో పడిన గజరాజు- జోరుగా సహాయక చర్యలు

ABOUT THE AUTHOR

...view details