పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంపై మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లెల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
'లోపాలు సరిదిద్దుకుని ముందుకు నడవాలి' - మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్లీకేరీ
రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంచిర్యాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులంతా కలిసి కృషి చేయాలని కలెక్టర్ భారతి హోళికేరీ అన్నారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరీ
మొదటి విడతలోని లోపాలను రెండో విడతలో సరిదిద్దాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థులను చైతన్యం చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు.
- ఇదీ చూడండి: 'మున్సిపోల్స్' ప్రతిపైసా లెక్కచెప్పాల్సిందే..!