తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాల పురపోరులో తెరాస జోరు... - telangana municipal elctions 2020

మంచిర్యాల జిల్లాలోని 6 మున్సిపాలిటీలనూ తెరాస కైవసం చేసుకుంది. పాత పురపాలక సంఘాలతో పాటు... నూతనంగా ఏర్పాటైన చెన్నూరు, క్యాతన్​పల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసింది. నస్పూర్​లో మిగతా పార్టీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది.

మంచిర్యాల పురపోరులో తెరాస జోరు...
మంచిర్యాల పురపోరులో తెరాస జోరు...

By

Published : Jan 25, 2020, 5:53 PM IST

Updated : Jan 25, 2020, 7:53 PM IST

మంచిర్యాల పురపోరులో తెరాస జోరు...

మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు చూపించింది. జిల్లాలోని అన్ని పురపాలికల్లో తెరాస జయకేతనం ఎగురవేసింది. మంచిర్యాల మున్సిపాలిటీలో 36 స్థానాలకు గానూ తెరాస 21 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ 14, ఇతరులు ఒక స్థానం గెలుచుకున్నారు. బెల్లంపల్లిలో 34 స్థానాలకు గానూ అధికార పార్టీ 25 వార్డుల్లో విజయం సాధించి... మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్‌ 2, భాజపా 1, ఇతరులు 6 స్థానాలు గెలుచుకున్నారు. చెన్నూర్‌లో 18 స్థానాలు ఉండగా 16 వార్డులు గులాబీ ఖాతాలో వేసుకుంది. ఇతరులు రెండు వార్డులు గెలుచుకున్నారు.

నస్పూర్​లో 25కు 10 స్థానాలు గెలుచుకుని తెరాస ఆధిపత్యం చాటుకుంది. కాంగ్రెస్‌ 6, భాజపా 3, ఇతరులు 6 స్థానాలు గెలుపొందారు. విజయానికి అవసరమైన సీట్లు దక్కకపోయినా.. స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్​ అఫీషియో ఓట్ల సాయంతో ఛైర్మన్ గిరి సొంతం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గానూ 19 గెలుచుకుని ఛైర్మన్​ పదవిని తెరాస తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌ 1, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. లక్షెట్టిపేటలో 15కు 10 స్థానాలు తెరాస కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 4, ఇతరులు ఒక చోట విజయం సాధించారు.

మంచిర్యాల పురపోరులో తెరాస జోరు...

ఇదీ చూడండి: బస్తీకా బాద్​షా: పట్టణాల్లో గులాబీ పార్టీకి పట్టం..

Last Updated : Jan 25, 2020, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details