తెలంగాణ

telangana

ETV Bharat / state

తన ఇంట్లోకి రావొద్దన్నందుకు చంపేశాడు! - MAN MURDER

ఇంటికి సిమెంట్ ప్లాస్టింగ్.. ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసింది. గొడవ జరిగిన క్షణాల్లోనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

man-murder-at-manchiryala-district
ఇంటి స్థల విషయంలో వ్యక్తి దారుణ హత్య

By

Published : Jun 2, 2020, 5:08 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దాగం సురేందర్​ పాత ఇంటికి ప్లాస్టింగ్​ చేయిస్తున్న సమయంలో పక్కింట్లో ఉంటున్న దుర్గయ్య ప్లాస్టింగ్​ తన భూమిలోకి వచ్చి చేయవద్దని చెప్పాడు.

ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర కోపానికి గురైన సురేందర్​ బండరాయితో దుర్గయ్య తలపై బలంగా కొట్టాడు. దీనితో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆగని కరోనా.. మరో 94 కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details