తెలంగాణ

telangana

ETV Bharat / state

అంగరంగ వైభవంగా గాంధారి ఖిల్లాపై మైసమ్మ జాతర - maisamma jatara on maisamma khilla at mandamarri

మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామంలోని గాంధారి ఖిల్లాపై మూడు రోజులపాటు జరిగిన మైసమ్మ జాతర ముగిసింది. అమ్మవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసులు వచ్చారు.

maisamma jatara on maisamma khilla at mandamarri
అంగరంగ వైభవంగా గాంధారి ఖిల్లాపై మైసమ్మ జాతర

By

Published : Feb 9, 2020, 7:05 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామశివారులో గాంధారి ఖిల్లాపై మైసమ్మ జాతర ఘనంగా జరిగింది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన మైసమ్మకు గిరిజనులు సంప్రదాయబద్ధంగా మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు తరలివచ్చారు. అనంతరం జంతు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గుట్ట కింద ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు చేస్తూ నిర్వహించిన కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

అంగరంగ వైభవంగా గాంధారి ఖిల్లాపై మైసమ్మ జాతర

ఇవీ చూడండి:మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం

ABOUT THE AUTHOR

...view details