మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, భీమారం మండలాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో మహా శివరాత్రి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. గోదావరి నదిలో స్నానమాచరించి... అనంతరం శివునికి ప్రత్యేక అభిషేకం చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకుంటున్నారు.
'మంచిర్యాల జిల్లాలో భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు' - Mahashivaratri Mancherial District
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. శివనామ స్మరణతో జిల్లాలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. శివునికి అభిషేకం చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
Mancheriyal Mahashivaratri
దైవ నామస్మరణతో జిల్లావ్యాప్తంగా శివాలయాలు మార్మోగాయి. భారీగా భక్తులు రావడం వల్ల శివాలయాల్లో సందడి నెలకొంది. దైవదర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఇవీ చూడండి:శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు