తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లితో ఒక్కటవ్వాల్సిన ప్రేమ జంట.. క్షణికావేశంతో మృత్యుఒడికి - మంచిర్యాల జిల్లా వార్తలు

Lovers Suicide in Mancherial : సాధారణంగా ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే ఆ జంట ఆత్మహత్యకు పాల్పడటం మనం చూస్తూనే ఉంటాం. మంచిర్యాల జిల్లాలోనూ అలాగే ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్​ ఏంటంటే వీరి వివాహానికి ఇంట్లో పెద్దలు ఓకే చెప్పారు. త్వరలోనే పెళ్లితో ఈ జంట ఒక్కటి కాబోతుంది. ఇంతలోనే వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకీ వీరి మరణానికి కారణం ఏంటంటే..?

ప్రేయసి ప్రయుడు
ప్రేయసి ప్రయుడు

By

Published : Feb 20, 2023, 9:32 AM IST

Lovers Suicide in Mancherial: ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వారితో ఎన్ని పనులు అయినా చేయిస్తుంది. ఒకసారి ఆనందాన్ని, మరోసారి బాధను ఇస్తుంది. ప్రేమ.. వివాహంగా మారడానికి ప్రేమికులు ఇంట్లో ఒక యుద్దం చేయాల్సిందే. ఇక్కడా ఈ జంట అవన్నీ చేసింది. ఇంట్లో పెద్దలను తమ పెళ్లికి ఒప్పించింది మంచిర్యాలకు చెందిన ఈ ప్రేమ జంట. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌ మండలం దొనబండకు చెందిన సంఘవి(21) డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఆ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్​ శ్రీకాంత్​(25)తో ప్రేమలో పడింది. వీరిద్దిరి ప్రేమ విషయం తెలిసి వారి ఇంట్లో తెలిసి పెద్దలు అందరి కలిసి పెళ్లికి అంగీకరించారు.

అంతా అనుకున్నట్లుగానే జరుగుతున్నా.. ఆ ప్రియుడి మనసులో మాత్రం ఎందుకో చిన్న వెలితిగా ఉంది. ''కోరుకున్న అమ్మాయిని ఇల్లాలిగా చేసుకుంటున్నాను సరే.. ఇంటికొచ్చాక ఆమెను సరిగా పోషించగలనా.. ప్రేమలో ఉన్నప్పటిలా అడిగిందల్లా అందించగలనా.. కోరిక ఏదైనా కాదనకుండా తీర్చగలనా'' అనే ఆలోచన మొదలైంది. దీనికి తోడు అప్పటికే అతడు చేసిన అప్పులు ఇవన్నీ సాధ్యమేనా అనే ప్రశ్న రేకెత్తేలా చేశాయి.

దీంతో శ్రీకాంత్​ శుక్రవారం తన ప్రేయసి సంఘవిని తీసుకొని దగ్గరల్లో ఉన్న ఎల్లంపల్లి జలాశయ సమీపంలోకి ఆటోలో వెళ్లారు. అక్కడ కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఆమెతో అప్పులు పెరిగిపోయాయని, తనను పెళ్లి చేసుకుంటే బతకడం కష్టంగా ఉంటుందని, వివాహం చేసుకోలేనని చెప్పాడు. అలా చెప్పిన మరుక్షణమే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు.

ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్న సంఘవి భయాందోళనకు లోనై ఆమె కూడా ఆ సీసా లాక్కొని తాగింది. చివరకు ఇద్దరూ బతకాలని నిశ్చయించుకుని శ్రీకాంత్​ కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి విషయం చెప్పారు. అనంతరం శ్రీకాంత్ తాను తెచ్చిన ఆటోలోనే ప్రేయసిని తీసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అనంతరం వారి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వారిని ప్రైవేటు వైద్యశాలకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం శ్రీకాంత్ మృతి చెందాడు. కొన్ని గంటల వ్యవధిలోనే సంఘవి తుదిశ్వాస విడిచింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details