మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కాజ్ వే వంతెనపై ఇసుక లారీ బోల్తా పడింది. బైపాస్ రోడ్ అమరవీరుల స్తూపం వద్ద మంచిర్యాల నుంచి రంగంపేట వైపు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి పడిపోయింది.
వంతెనపై ఇసుక లారీ బోల్తా.. రాకపోకలకు అంతరాయం - latest accidents in telangana
ఇసుక లారీ బోల్తా పడిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. దీంతో మంచిర్యాల, రంగంపేట మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.

వంతెనపై ఇసుక లారీ బోల్తా.. రాకపోకలకు అంతరాయం
ఇటీవల కురిసిన వర్షాలతో కాజ్ వే వంతెనపై వరద నీరు ఉప్పొంగి పైభాగం కొట్టుకుపోవడం వల్ల లారీ మట్టిలో కూరుకుపోయింది. దీంతో మంచిర్యాల, రంగంపేట మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.