తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణిలో ప్రమాదం... ఓ కార్మికుడు మృతి - సింగరేణిలో ప్రమాదం... ఓ కార్మికుడు మృతి

ఓవైపు కార్మికుల రక్షణ కోసం వారోత్సవాలు జరుగుతుండగా... మరోవైపు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందటం వల్ల మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ సింగరేణి ఏరియాలో విషాదఛాయలు అలుముకున్నాయి. గనిలో పని చేస్తుండగా... మల్లయ్య అనే కార్మికునిపై పైనుంచి టబ్బులు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

LABOUR DIED IN SRIRAMPUR SINGARENI AREA
LABOUR DIED IN SRIRAMPUR SINGARENI AREA

By

Published : Dec 16, 2019, 9:49 PM IST

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే-6 గనిలో జనరల్ మజ్దూర్ కార్మికుడు చంద్రయ్య బొగ్గు తరలించే క్రమంలో ప్రమాదం జరిగింది. గనిలో పని చేస్తుండగా... పైనుంచి టబ్బులు ఆకస్మికంగా దూసుకు రావటం వల్ల మలుపు వద్ద పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కార్మికుడు మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఓవైపు సింగరేణిలో కార్మికుల రక్షణ కోసం వారోత్సవాలు జరుగుతుండగా... తొలిరోజే ఈ ఘటన జరగటం వల్ల అంతా విషాదంలో మునిగిపోయారు. మల్లయ్య మృతికి సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, రక్షణ చర్యలు తీసుకుని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.

సింగరేణిలో ప్రమాదం... ఓ కార్మికుడు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details