మంచిర్యాలలో కిసాన్ ర్యాలీ నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన్ కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. సమగ్ర వ్యవసాయ విధానాలు, పంట మార్పిడి, సాంకేతికత, భూసారాన్ని పెంచడం, చిరుధాన్యాల సాగు, బిందు సేద్యం వంటి అంశాలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.
జిల్లా కలెక్టర్ భారతి సేంద్రియ వ్యవసాయంలో సాగు చేసిన కూరగాయలను పరిశీలించి, అన్నదాతలను అభినందించారు. సేద్యంలో రసాయనాల వాడకం తగ్గించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న పథకాలను వివరించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన రైతులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.