తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో పులి హంతకులు దొరికారు - 6 MEMBERS ARREST

చిరుత పులిని చంపిన ఘటనలో పరారీలో ఉన్న నిందితులు రామగుండం సీసీఎస్ పోలీసులకు చిక్కారు. వీరందరిరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.

నిందితుల

By

Published : Mar 29, 2019, 11:36 PM IST

మంచిర్యాలలో పులి హంతకులు దొరికారు
మంచిర్యాలలో చిరుత పులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాలో మిగిలిన సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారం క్రితం మహారాష్ట్రలోని చేగుంట గ్రామంలో చిరుతను హతమార్చి.. చర్మం, గోళ్లతో మంచిర్యాల వచ్చారు. పోలీసుల దాడిలో అప్పుడు నలుగురు దొరకగా... తప్పించుకు తిరుగుతున్న ఆరుగురిని ఇవాళఅరెస్ట్ చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. నిందితుల నుంచి చిరుత గోర్లు, చర్మాన్ని ఒలవడానికి ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details