తెలంగాణ

telangana

ETV Bharat / state

'జూడాలుపై దాడికి నిరసనగా మంచిర్యాలలో ధర్నా'

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూడాలుపై జరిగిన దాడికి నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. వైద్యులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

By

Published : Jun 17, 2019, 8:24 PM IST

వైద్యులకు తగిన రక్షణ కల్పించాలి

కోల్​కతా మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యులపై దాడికి నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలను నిలిపివేశారు. వైద్యులపై జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలు చేసినప్పటికీ ఆచరణలో లోపం ఉందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న రోగిని ఏ వైద్యుడైనా బతికించేందుకే కృషి చేస్తారని, కొంతమంది విచక్షణారహితంగా డాక్టర్లపై దాడులకు దిగడం అమానుషమన్నారు.
డాక్టర్లపై జరుగుతున్న దాడుల గురించి ఆలోచిస్తే భవిష్యత్​లో వైద్య వృత్తి చేపట్టడానికి వెనకడుగు వేస్తారని మంచిర్యాల జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

వైద్యులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి : ఐఎంఓ

ABOUT THE AUTHOR

...view details