కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి సాయిబాబా ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మహన్యాస రుద్రాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం 15 గంటల పాటు కొనసాగే జలాభిషేకాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు జలాల్ని శివునిపై పోస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.
మందమర్రిలో వైభవంగా శివునికి జలాభిషేకం - jalabhishekam to lord shiva
మంచిర్యాల జిల్లా మందమర్రి సాయిబాబా ఆలయంలో శివునికి మహన్యాస రుద్రాభిషేకం చేసి ప్రత్యేక పూజలు, జలాభిషేకం నిర్వహించారు.
మందమర్రిలో వైభవంగా శివునికి జలాభిషేకం