తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతర్రాష్ట్ర జూదగాళ్ల అరెస్టు.. 2 లక్షలు స్వాధీనం - రామగుండ సీపీ సత్యనారాయణ తాజా వార్తలు

అంతర్రాష్ట్ర జూదగాళ్ల గుట్టురట్టు చేసి కేసులు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. జన సంచారం లేని ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వాహకులు పేకాట ఆడిస్తున్నారని.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జూదరుల ఆటకు అడ్డుకట్టవేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు.

అంతర్రాష్ట్ర జూదగాళ్ల అరెస్టు.. 2 లక్షలు స్వాధీనం
అంతర్రాష్ట్ర జూదగాళ్ల అరెస్టు.. 2 లక్షలు స్వాధీనం

By

Published : Aug 22, 2020, 6:53 PM IST

అంతర్రాష్ట్ర జూదగాళ్ల గుట్టురట్టు చేసి కేసులు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మంచిర్యాలలో తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర కి వెళ్లి అందర్, బహార్ ఆడిస్తున్న నిర్వాహకుల గుట్టు బయట పెట్టినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. రెండు లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్పష్టం చేశారు.

మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన శంకర్, చెన్నూరుకు చెందిన లక్ష్మీనారాయణ తిరుపతి, రామగుండంలోని పెద్ద పేటకు చెందిన రాజేశ్‌, పెద్దపల్లి జిల్లా సూరయ్య పల్లికి చెందిన రాజిరెడ్డి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ సత్యనారాయణ వెల్లడించారు. జన సంచారం లేని ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వాహకులు పేకాట ఆడిస్తున్నారని.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జూదరుల ఆటకు అడ్డుకట్టవేసి అరెస్టు చేయడం జరిగిందని రామగుండం సీపీ తెలిపారు.

ఇదీ చదవండి:ఈగ ఫిక్షనల్‌.. ఎలుక ఒరిజినల్‌

ABOUT THE AUTHOR

...view details