ఇంటర్ వార్షిక పరీక్షల్లో నిమిషం నిబంధన ఓ విద్యార్థిని పరీక్షకు దూరం చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని భారతి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భానుప్రసాద్... అనివార్య కారణాల వల్ల 09 గంటల 06 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు.
ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి.. పరీక్షకు దూరమయ్యాడు. ఒక్క నిమిషం ఆలస్యమైనా.. అనుమతించమన్న నిబంధన వల్ల మొదటి పరీక్షనే రాయలేక తిరిగి ఇంటి ముఖం పట్టాడు ఆ విద్యార్థి.
INTER FIRST YEAR STUDENT LATE TO EXAM CENTER IN BELLAMPALLI
నిమిషం ఆలస్యమైనా... పరీక్ష కేంద్రంలోనికి అనుమతించకూడదన్న నిబంధన అమల్లో ఉండటం వల్ల... ఆరు నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థిని అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ఎంత బతిమాలుకున్నా అధికారులు కఠినంగా వ్యవహరించారు. చేసేదేమిలేక... విద్యార్థి నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.