మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 10 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఇంటి కిరాయి చెల్లించాల్సిన యజమాన్యం ఇప్పటివరకు చెల్లించలేదని ఆరోపించారు.
నస్పూర్ మున్సిపాలిటీలోని సింగరేణి కార్మికులకు హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఎనిమిదో రోజుకు చేరింది. వేజ్ బోర్డు ప్రకారం 10 శాతం ఇంటి కిరాయి చెల్లించాలని వాసిరెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చాలని ఎస్ఆర్పీ మూడో గనిలోని కార్మికులు నినదించారు.