మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 11 న అక్రమంగా చేపట్టిన రిజిస్ట్రేషన్ల విషయంలో ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ ధ్యాన్ రతన్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ వెల్లడించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన 39 డాక్యుమెంట్లను ఎల్ఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు విచారణలో వెల్లడైనట్టు సమాచారం. లక్షెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ ఇక్బాల్ వ్యక్తిగత కారణాలతో ఈనెల 10, 11 తేదీల్లో సెలవుపై వెళ్లగా ఇంఛార్జిగా విధులు నిర్వహించిన రతన్ ఆధ్వర్యంలో రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక డాక్యుమెంటులో ఉన్న భూమిని కేవలం ఒక్కరికే రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధనలకు విరుద్దందా చేశారని ఇతర పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరో వైపు లేఅవుట్లు ఏర్పాటు జరగకుండానే కొంత భూమిని రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారని విపక్ష పార్టీల సభ్యులు ప్రశ్నించారు. మొత్తం 60 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం యత్నించగా.. 39 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే విపక్ష పార్టీల ఆధ్వర్యంలో గొడవ జరిగింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ చేపట్టిన అధికారులు చర్యలు తీసుకున్నారు.
అక్రమంగా రిజిస్ట్రేషన్లు.. ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ - ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్
నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారన్న ఆరోపణలతో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు. ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో చర్యలు తీసుకున్నారు.
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు సర్వే నెంబర్లలోని భూముల్లో తెరాస నాయకులు అనుమతి తీసుకోకుండానే అక్రమంగా సిరాస్థి వ్యాపారం చేస్తున్నారని ఇతర పార్టీల సభ్యులు ఆరోపించారు. దీంతో ఇంఛార్జి రిజిస్ట్రార్ రతన్, ఇతర సిబ్బంది ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.15 వేల రుపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. దీంతో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ లేని సమయంలో అక్రమ ఫ్లాట్ల రిజిస్టేషన్లు చేయాలన్న బాగోతం బట్టబయలైంది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ రతన్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.