మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలో జిల్లా పాలనాధికారి భారతి హోళికేరి పర్యటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వార్డుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఇళ్ల ముందు చెత్త ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితోనే పెడ ఎత్తించారు. మరో రైతు ఇంటి ముందు పేడ ఉండడాన్ని గమనించిన పాలనాధికారి... వివరాలు ఆరా తీశారు. ఫోన్లో మాట్లాడి పేడను తొలగించాలని అన్నారు. లేకుంటే 5,000 రూపాయల చొప్పున జరిమానా విధించడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఇంటి ముందు పేడ ఉంటే రూ.5వేల జరిమానా - ఇంటి ముందు పేడ ఉంటే రూ.5వేల జరిమానా
నెల రోజుల ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి. మందమర్రి మండలం అందుగులపేటలో పర్యటించారు. రైతు ఇంటి ముందు పేడ ఉండడాన్ని గమనించిన పాలనాధికారి తొలగించాలని చెప్పారు. లేకుంటే రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

చెత్త తీయిస్తున్న కలెక్టర్