చిట్టీల పేరుతో అమాయక ప్రజల నుంచి మూడు కోట్ల రూపాయలకు భార్యాభర్తలు టోకరా పెట్టారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్లో చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు వారిని ఏసీపీ నరేందర్ అదుపులోకి తీసుకున్నారు.
చిట్టీల పేరుతో రూ.3కోట్ల టోకరా... భార్యాభర్తల అరెస్ట్ - Fraud in the name of chits in Naspur
చిట్టీల వ్యాపారం చేస్తూ మోసం చేసిన దంపతులను మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిట్టీల పేరుతో భార్యాభర్తలు 3కోట్ల రూపాయలు టోకరా...
సుధాకర్, సుశీలలు 3నెలల క్రితం సుమారు 100 మంది బాధితుల నుంచి మూడు కోట్ల రుపాయల వరకు వసూలు చేసి.. హైదరాబాద్ ఐదు అంతస్తుల భవనం, ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు వారి స్థిరాస్తులను స్వాధీనం చేసుకుని న్యాయం చేసే దిశగా ప్రయత్నిస్తామని ఏసీపీ నరేందర్ తెలిపారు.
ఇదీ చూడండి: ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం