మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలిపోయాయి. నెన్నెల మండలం కొనంపేటలో బక్కయ్య అనే వ్యక్తికి చెందిన ఇంటిగోడ కూలింది. బొప్పారం గ్రామానికి చెందిన అమృత అనే మహిళ ఇల్లు, ఆవడం గ్రామానికి చెందిన వెంకమ్మ ఇంటిగోడలు కూలిపోయాయి.
వరుస వర్షాలకు.. బెల్లంపల్లిలో కూలిన ఇళ్లు! - బెల్లంపల్లి వార్తలు
ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పలువురి ఇళ్లు కూలిపోయాయి. వర్షాల కారణంగా నివాసం కోల్పోయి.. రోడ్డున పడ్డ తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
వరుస వర్షాలకు.. బెల్లంపల్లిలో కూలిన ఇళ్లు!
కన్నెపల్లి మండలంలో ఆల్కారి జయ అనే మహిళకు చెందిన ఇల్లు వానలకు నాని నేలకూలింది. భీమిని మండలం ఖర్జి భీంపూర్ గ్రామానికి చెందిన బాపు అనే వ్యక్తి ఇల్లు వర్షాలకు కూలిపోయింది. ఇళ్లు కూలిపోయి.. రోడ్డున పడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చూడండి :'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'