మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీ చైతన్య పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు వివిధ రాష్ట్రాల సంస్కృతి, మీరాబాయి వేషధారణలో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలలో త్రిభాషా సూత్రం తప్పకుండా అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులు అయూబ్ అన్నారు. ఆంగ్లం, తెలుగు భాషకు ఇచ్చే ప్రాధాన్యత హిందీకి కూడా ఇవ్వాలన్నారు.
'హిందీకి కూడా ప్రాధాన్యత ఇవ్వండి'
మందమర్రిలోని ఓ పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మీరాబాయి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ఆంగ్లం, తెలుగు భాషకు ఇచ్చే ప్రాధాన్యత హిందీకి కూడా ఇవ్వాలని పాఠశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
'హిందీకి కూడా ప్రాధాన్యత ఇవ్వండి'