తెలంగాణ

telangana

ETV Bharat / state

బాధిత పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా... పోక్సోకోర్టు - హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ తాజా వార్తలు

POCSO Court started in mancherial: బాధిత పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా వీలైనన్ని పోక్సో కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోక్సో న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్ ప్రారంభించారు.

POCSO Court started in mancherial
మంచిర్యాలలో పోక్సో కోర్టు

By

Published : Mar 13, 2022, 10:00 PM IST

POCSO Court started in mancherial: చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాళ్లను కఠినంగా శిక్షించేందుకు సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా పోక్సో కోర్టులను ఏర్పాటు చేస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోక్సో న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్ ప్రారంభించారు.

'పిల్లలపై అత్యాచార కేసుల విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కార్ పోక్సో కోర్టులు ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా గిరిజన, ఆదివాసీ తండాల్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో.. నిందితులు చాలా కేసుల్లో తప్పించుకుంటున్నారు. ఇలాంటి నేరాలకు చెక్‌ పెట్టి.. బాధితులకు అండగా నిలిచేందుకు న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే చిన్న పిల్లలపై జరిగే నేరాలపై వేగంగా విచారణ జరిపేందుకు మంచిర్యాల జిల్లాలో పోక్సో కోర్టు ఏర్పాటుచేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. బాధితుల నుంచి సమాచారం తెలుసుకునేందుకు అనువైన వాతావరణం, వాళ్ల బంధువులు కూర్చేనేందుకు ప్రత్యేక వసతులు కల్పించాం. వీడియో కాన్ఫరెన్స్‌లోనూ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.'

-కె.లక్ష్మణ్, హైకోర్టు న్యాయమూర్తి

పోక్సో న్యాయస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, జిల్లా ఉన్నతాధికారులతో పాటు స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Harish rao in Medak tour: ఆమె స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నాం: హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details