మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఉదయం నుంచి భారీగా పొగమంచు అలుముకుంది. వేకువ నుంచి ఉదయం 9గంటల వరకు మంచు తెరలు వీడలేదు. నిత్యం బొగ్గు, దుమ్ముతో కప్పి ఉండే పట్టణం మంచు తెరల మాటున దాక్కుంది.
మందమర్రిలో మంచు అందాలు - మంచిర్యాలలో మంచు
నిత్యం బొగ్గు దుమ్ము, ధూళితో కనిపించే మందమర్రి.. తెల్లని మంచు దుప్పటి కప్పుకుంది. ఉదయం నుంచి సుమారు 9 గంటల వరకు పొగమంచు కప్పేసింది.
![మందమర్రిలో మంచు అందాలు మందమర్రిలో మంచు అందాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10148168-thumbnail-3x2-snow-fall-rk.jpg)
మందమర్రిలో మంచు అందాలు
మంచుకు తోడు వర్షం తుంపరలు తోడై ఉదయాన్ని మహింత ఆహ్లాదంగా మార్చాయి. పొగమంచు వల్ల వాహన చోదకులు, ఉదయపు నడకకు వచ్చే వారు ఇబ్బంది పడ్డారు.
ఇదీ చూడండి:ఉద్యోగం రాలేదని.. ఊరికే ఉండిపోలేదు..