మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. రాష్ట్రీయ రహదారిపై పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ఇళ్ల పైన రేకులు లేచిపోయాయి.
బీభత్సం సృష్టించిన వడగండ్ల వర్షం... - rain effect
ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం మంచిర్యాల జిల్లా తాండూరులో బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.
బీభత్సం సృష్టించిన వడగండ్ల వర్షం...
భారీ ఈదురు గాలులతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అధికారులు నష్టం విలువను అంచనా వేస్తున్నారు. అకాల వర్షంతో కలిగిన నష్టం నుంచి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.