తెలంగాణ

telangana

ETV Bharat / state

మందమర్రిలో భారీ వర్షం.. వాహనదారుల ఇక్కట్లు - మందమర్రిలో భారీ వర్షం వార్తలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

heavy-rain-at-mandamarri-in-mancherial-district
మందమర్రిలో భారీ వర్షం.. వాహనదారుల ఇక్కట్లు

By

Published : Sep 17, 2020, 10:01 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

స్థానిక పాత బస్టాండ్​లోని రహదారితో పాటు పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదీచూడండి.. వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు... మృతి

ABOUT THE AUTHOR

...view details